22-02-2025 12:54:30 AM
* గాంధీభవన్ మెట్లపై రైతు యాదగిరి నిరసన
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ. 2 లక్షల రుణమాఫీ తనకు అమలు కాలేదంటూ సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన రైతు తోట యాదగిరి శుక్రవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ మెట్లపై ఆందోళనకు దిగాడు.
వెంటనే తనకు రుణమాపీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్త్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ తనకు మాత్రం రుణమాఫీ కాలేదన్నారు. మరో వైపు తనకు ఎలాంటి పెన్షన్ లభించడం లేదని, ప్రభుత్వ సాయంతో వరికి బోనస్ కూడా రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.