calender_icon.png 20 March, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావోద్వేగాన్ని గొప్పగా పలికించలేకపోయా

20-03-2025 12:08:21 AM

హీరో యష్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దీన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కే నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. కన్నడ, ఇంగ్లిష్‌లో రూపొందుతున్న తొలి భారీ చిత్రమిది. ఇందులో అమెరికన్ నటుడు కైల్ పాల్ ఓ కీలక పాత్రలో నటించారు.

ఈ చిత్రంలో పనిచేయడం గురించి తాజాగా కైల్ పాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. “నేను ఇండియాలో ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ సమయంలో ఓ గొప్ప అనుభవాన్ని పొందాను. తెలియని భాషలో భావోద్వేగ సన్నివేశాల్లో నటించడం ఎంతో సవాలుతో కూడుకున్నది. కానీ ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరచిపోలేను. ఆరోజు ఉదయం మూడు గంటలకు షూటింగ్ చేస్తున్నాం.

అదొక భావోద్వేగ సన్నివేశం. అందులో నేను కన్నడలో మాట్లాడాలి. ఆ పదాలను తార్కికంగా ఆలోచిస్తూ భావోద్వేగం ప్రదర్శించాలి. నేను తార్కికంగా ఆలోచించలేకపోయా.. కాబట్టి భావోద్వేగాన్ని గొప్పగా పలికించలేకపోయా. డైరెక్టర్ గీతు అద్భుతమైన వ్యక్తి. మీరు ఈ సన్నివేశంలో బాగా నటించగలరు. ప్రయత్నించండి.. కావాలంటే ఇంకా సమయం తీసుకోండి అని నన్నెంతగానో ఉత్సాహపరిచారు.

ఇది నటుడిగా నేను ఎదుర్కొన్న గొప్ప అనుభవం. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని పేర్కొన్నారు కైల్ పాల్. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.