- సీఎం రేవంత్‌రెడ్డి 28 సార్లు ఢిల్లీ వెళ్లారు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి.. పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో.. సావుకు పోతున్నావో.. ఢిల్లీకి 28సార్లు పోయి 28 రూపాయలు తీసుకరాలేదని అడగటం తెలంగాణ పౌరులుగా తమ బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
సోమవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో కేంద్రం నుంచి అదనంగా ఒక రూపాయి తెచ్చింది లేదని ధ్వజమెత్తారు. ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో చెప్పాలని డిమాం డ్ చేశారు.
ఈడీ చేసిన దాడులు కనీ సం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్లు పట్టుకుని తప్పించుకున్నారో తెలపాలని పేర్కొన్నారు. బడే బాయ్ చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టల దొరా అని నిలదీశారు. పోరాటం తెలంగాణ రక్తంలో ఉందని, తాము నీ మాదిరిగా ఎన్నడూ ఢిల్లీకి గులాములం కాదని స్పష్టం చేశారు.
పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర సీఎం రేవంత్‌రెడ్డిది అని, కొట్లాడి తెచ్చిన తెలంగాణను తెర్లు చేయాలని ప్రయత్నించి పట్టుబడిన ఓటుకు నోటు చరిత్ర నీదని విమర్శించారు. మా జెండా, ఎజెండా ఎన్నటికైనా తెలంగాణ అభివృద్ధేనని కేటీఆర్ పేర్కొన్నారు.