ప్రభాస్ కథానాయకుడిగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కల్కి2898ఏడీ’. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విశేష స్పందనపై అమితాబ్ బచ్చన్ ఆనం దం వ్యక్తం చేశారు. “ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే ఎంతో ఆనం దంగా ఉంది. ఇలాంటి సక్సెస్‌లు ప్రభాస్‌కు రొటీన్‌గా మారాయి. ఇటీవల ఆయన నటించిన చాలా చిత్రాలు రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరాయి. నా వరకూ ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఇప్ప టికే నాలుగు సార్లు ఈ సినిమా చూశా.. చూసిన ప్రతిసారీ కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నా. దీన్ని ఎంత ఎంజాయ్ చేశానో మాటల్లో చెప్పలేను. ‘కల్కి’ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు, ధన్యవాదాలు” అని పేర్కొన్నారు బిగ్ బీ.