calender_icon.png 15 January, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమెతో నేను పోటీ పడలేను

02-08-2024 12:09:05 AM

పారిస్: ఒలింపిక్స్‌లో ఇటలీ మహిళా బాక్సర్ ఏంజెలినా కరిని వివాదాస్పద రీతిలో వైదొలిగింది. విషయంలోకి వెళితే.. మహిళల వెల్టర్‌వెయిట్ విభాగంలో ఏంజెలినా అల్జేరియా బాక్సర్ ఇమానే కెలిఫ్‌తో ప్రిక్వార్టర్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. తొలుత రింగ్‌లో అడుగుపెట్టిన ఏంజెలినా కెలిఫ్ పంచుల ధాటికి తట్టుకోలేకపోయింది. 46 సెకన్ల తర్వాత కెలిఫ్‌తో తాను ఆడలేనని ఏంజెలినా తేల్చి చెప్పడంతో రిఫరీ కెలిఫ్‌ను విజేతగా ప్రకటించారు. కాగా 2023 వరల్డ్ చాంపియన్‌షిప్స్ సందర్భంగా కెలిఫ్ జెండర్ ఎలిజిబులిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయింది. తాజాగా ఒలింపిక్ నిర్వాహకులు మాత్రం కెలిఫ్‌ను విజేతగా ప్రకటించారు.