calender_icon.png 21 October, 2024 | 9:16 AM

నేను స్వర్గానికి వెళ్లొచ్చాను

18-10-2024 01:35:37 AM

న్యూయార్క్, అక్టోబర్ 17: ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మనిషి స్వర్గం, నరకం గురించి దాదాపు ఒకే రకంగా ఆలోచిస్తాడు. మంచి చేస్తే సర్గానికి వెళ్తామని, చెడు చేస్తే నరకానికి వెళ్తామని నమ్ముతుంటారు. అసలు స్వర్గం, నరకం అనేవే లేవని కొట్టిపారేసేవాళ్లను పక్కన పెడితే అమెరికాకు చెందిన 68 ఏండ్ల మహిళ తాను స్వర్గాని వెళ్లి తిరిగి వచ్చామని చెప్తున్నారు. కాన్సాస్‌లోని విచిటాకు చెందిన చార్లెట్ హామ్స్ అనే ఈవిడ 2019లో తీవ్ర అనారోగ్యంతో దవాఖానలో చేరారు.

రక్తపోటు అధికం కావటంలో 11 నిమిషాల పాటు కోమాలోకి వెళ్లారు. దీంతో ఆమె చనిపోయారని వైద్యులు ప్రకటించారు. 11 నిమిషాల తర్వాత స్రృహలోకి వచ్చిన ఆమె.. అప్పటి నుంచి తాను స్వర్గానికి వెళ్లి వచ్చానని కనిపించినవారికందరికీ చెప్తున్నది. స్వర్గంలో దేవతలతోపాటు తన కుటుంబసభ్యులను కూడా కలిశానని చెప్తున్నారు. స్వర్గంలో అద్భుత సువాసలు వెదజల్లుతున్న పుష్ఫాలు ఉన్నాయని, వాటిని తాను వాసన చూసినట్లు పేర్కొంటున్నారు.