23-04-2025 01:24:02 AM
జైపూర్, ఏప్రిల్ 22: భారత్ బంధం బలోపేతం కోసమే భారత పర్యటనకు వచ్చినట్టు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. మంగళవారం వాన్స్ తన కుటుంబం తో కలిసి రాజస్థాన్‌లోని యునెస్కో వారసత్వ సంపద అంబర్ కోటను సందర్శించుకున్నారు. వాన్స్ కుటుంబానికి స్థానిక రాజస్థానీ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. వాన్స్ కుటుంబం హవా హల్, జంతర్ మంతర్ వంటి ప్రసిద్ధ స్మార క చిహ్నాలను సందర్శించుకుంది.
అనంతరం జేడీ వాన్స్ జైపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘బంధాన్ని బలోపేతం చేసుకునేందుకే ఇక్కడి వచ్చాం. మీరు ఏం చేయా లో పాఠాలు చెప్పేందుకు రాలేదు. గతంలో భారత్‌లో తక్కువ వేతనాలకు కార్మికులు లభిస్తారని అంతా అనుకునే వారు. మేము అలా చూడట్లేదు. మోదీకున్న ప్రజాభిమానం చూస్తుం టే నాకు అసూయ కలుగుతోందన్నారు. నేడు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు.