calender_icon.png 31 October, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాదయాత్రకు నేను, కేటీఆర్ రెడీ

31-10-2024 01:38:53 AM

  1. టైమ్ చెప్పు ఇద్దరం వస్తాం
  2. నీ కుర్చీని ఎవరు లాగుతారో చూసుకో
  3. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్‌ఎస్‌కు వంద సీట్లు 
  4. సీఎం రేవంత్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు కౌంటర్

హైదరాబాద్, అక్టోబర్ ౩౦ (విజయక్రాంతి): కేటీఆర్‌పై పగతోనే అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించా రు. మూసీ నుంచి వాడపల్లి వరకు రేవంత్‌తో పాదయాత్రకు తాను కేటీఆర్ రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు.

రేపా? ఎల్లుం డా? టైం చెప్తే ఇద్దరం వస్తామని సీఎంకు సవాల్ విసిరారు. గన్‌మెన్లు లేకుండా.. రేవంత్‌రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలన్నా రు. తనను డీల్ చేయడం కాదని, ముందు రేవంత్ సొంత కుర్చీని కాపాడుకోవాలని హితవు పలికారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్‌ఎస్‌కు  వంద సీట్లకు తగ్గకుండా వస్తాయని వివరించారు. 

సీఎం పదవి కేసీఆర్ భిక్ష

రేవంత్‌రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నిం చారు. ఐదేండ్ల తర్వాత వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనని ప్రజలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు ఓడిందని, దీంతో ఆపార్టీ ఖతం అయిపోయిందా అని ప్రశ్నించారు. 

బాపూఘాట్‌లో భారీ గాంధీ విగ్రహం పెడితే స్వాగతిస్తామన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మూసికి నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ డీపీఆర్ తయారు చేశారని గుర్తు చేశారు. ఏక్ పోలీస్ అమలు చేయమంటే సస్పెండ్ చేయటం అన్యాయమని హరీశ్‌రావు  మండిపడ్డారు.