calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ రెండంటే నాకు చాలా భయం

28-03-2025 12:00:00 AM

కొంతకాలంగా వరుస సినిమా షూట్స్, ప్రమోషన్స్ కారణంగా అభిమానులతో ముచ్చటిం చలేకపోయింది రష్మిక మందన్న. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహిం చింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తిరమైన సమాధానాలిచ్చింది. ఇటీవల తన కాలికి గాయం కావ టం గురించి కూడా మాట్లాడింది. ‘కాలు ఇప్పుడిప్పుడే నయమవుతోంది.

పూర్తిగా సెట్ కావడానికి ఇంకా 9 నెలల సమయం పడుతుంది’ అని సమాధానమిచ్చింది. కొరియన్ డ్రామాల గురించి చెప్తూ.. “ఇప్పటివరకు చూసిన వాటిలో ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ‘ఒకే నాట్ టు బీ ఓకే” అని తెలిపింది. తనకు ఎత్తు, నీటి లోతు ఎక్కువగా ఉండే ప్రదేశాలంటే చాలా భయం’ అని చెప్పింది.