సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచేవాడిని
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న తనకు 8 ఏళ్లుగా ఒక్క పదవీ లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తనకు అవకాశం కల్పించాలని కోరా రు. బుధవారం ఆయన, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్, కార్యదర్శి శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ తనకు ఇస్తే గెలిచేవాడినని, టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వీహె చ్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు ఏఐసీసీ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ తెలంగాణకు వస్తున్నందున.. ఈ కమిటీ ముందు సు నీల్ కనుగోలు వాస్తవాలను వివరించాలన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలి చిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఇండియా సిరాజ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలపడంతో పా టు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు.