న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తుంది. దీంతో తాను ఇప్పుడు నిరుద్యోగినని.. ఏదైనా జాబ్ ఉంటే చూడమని మీడియానుద్దేశించి ద్రవిడ్ చమత్కరించాడు. ‘నా జీవితంలో పెద్దగా మార్పు ఏం ఉండదు. అయితే ఈ విజయానందం నుంచి తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత మాములే. ఒకటి మాత్రం తేడా. ఇప్పటినుంచి నేను నిరుద్యోగిని. ఏదైనా ఉద్యోగావకాశం ఉంటే చూడండి’ అని ద్రవిడ్ అన్నాడు.