టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్లోనే స్టార్ హీరో అయిపోయిన విజయ్.. ఆ తర్వాత ‘గీత గోవిందం’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా.. విజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన రిలేషన్షిప్, ప్రేమ, పెళ్లి వంటి అంశాలపై ఓపెన్ అయ్యాడు.
తాను ఇప్పుడు రిలేషన్‌లో ఉన్నానని చెప్పకనే చెప్పాడు. ‘ప్రేమంటే ఏంటో నాకు తెలుసు. నాకు షరతుల్లేని ప్రేమ గురించి తెలియదు. ఎందుకంటే నా ప్రేమకు చాలా అంచనాలున్నాయి. కాబట్టి నా ప్రేమ కండీషన్స్‌తో కూడుకున్నదే. అయితే షరతులతో కూడిన ప్రేమను కోరుకోవడం ఎంతమేరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. ప్రతి ఒక్క అబ్బాయి 20 సంవత్సరాల తర్వాత ప్రేమ విషయంలో తీసుకునే నిర్ణయం నష్టానికి దారితీస్తుంది.
30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆలోచన తీరు మారుతుంది.. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ అనుభవం వచ్చిన తర్వాత ప్రేమపై అభిప్రాయాలు మారుతాయి. అయితే అదేమీ చెడ్డ విషయం కాదు.. కాకపోతే ఆలోచన తీరు వయసును బట్టి మారుతుంది.. స్వీయ అనుభవంతో చెబుతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు . ఇంకా రిలేషన్ షిప్ స్టేటస్ గురించి కూడా మాట్లాడుతూ.. నేను ఒంటరిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? నాకు ప్రస్తుతం 35 ఏళ్లు’ అంటూ తాను డేటింగ్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టాడు విజయ్.