calender_icon.png 28 October, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనే అత్యంత అంద విహీనుణ్ని!

03-07-2024 12:05:00 AM

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన వెంకటేశ్ ‘సైంధవ్’ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తాజాగా ఆయన నటించిన బాలీవుడ్ ‘రౌతు కా రాజ్’ సినిమా ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన నవాజుద్దీన్ సిద్ధిఖీ తన గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘కొంత మంది మన రూపాన్ని ఎందుకు ద్వేషిస్తారో నాకు తెలియదు. బహు శా మనం అంత అందంగా కనిపించకపోవడం వల్లే కావొచ్చు.

నేను కూడా నన్ను నేను అద్దంలో చూసుకుంటుంటా. అందంగా లేకపోయినా సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చానా?! అని ప్రశ్నించుకుంటా. బాలీవుడ్‌లో శారీరకంగా అత్యంత అంద విహీనంగా కనిపించే నటుడిని నేనే. ఆ విషయం నాకు తెలుసు. చిత్ర పరిశ్రమపై నాకు ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నా కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం ఇచ్చినందుకు ఇండస్ట్రీకి నా కృతజ్ఞతలు’ అని తన గురించిన విషయాలను పంచుకున్నారు నవాజుద్దీన్.