అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి
కరీంనగర్, అక్టోబరు 14: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వారి భవిష్యత్తుకు తాను భరోసాగా ఉంటానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన విస్తృతంగా పర్యటించారు. విద్యాసంస్థలను సందర్శించి ఉపాధ్యాయులు, అధ్యాపకులతో మాట్లాడారు. తనను గెలిపిస్తే అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించడమే కాకుండా పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు.