శ్రీవిష్ణు ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ‘ఎస్‌వీ18’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పిస్తోంది. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. 35 ఏళ్ల వయసులో కూడా తాను ఎందుకు ఒంటరిగా ఉన్నాడో హిలేరియస్‌గా వివరిస్తూ వెన్నెల కిషోర్ డైలాగ్‌తో టైటిల్ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. శ్రీవిష్ణు వాలెంటైన్స్ డే రోజు ఒక పార్కులోకి మ్యూజిక్ సిస్టమ్, క్రాకర్ కాల్చడం వంటి సన్నివేశాలు అలరిస్తాయి.
ఇద్దరు వేర్వేరు అమ్మా యిలు అతన్ని ప్రేమిస్తున్నా అతను ఎందుకు ఒంటరిగా ఉంటున్నా డనే ఆసక్తిని పెంచేలా గ్లింప్స్ యుత్ ఫుల్‌గా ఉంది. ఈ గ్లింప్స్‌లో హీరోయిన్లు కేతికాశర్మ, ఇవానాలను పరిచయం చేశా రు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్; డీవోపీ: ఆర్ వెల్ రాజ్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్; మాటలు: భాను భోగవరపు, నందు సవిరిగాన.