calender_icon.png 21 January, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పిల్లల చదువు బాధ్యత నాదే

17-07-2024 06:00:37 AM

  • హత్యకు గురైన సుగుణ కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్ 
  • రూ.5 లక్షల సహాయం, పిల్లల చదువు బాధ్యత తీసుకుంటానని హామీ

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇటీవల నర్సంపేట నియోజకవర్గం పదహారు చింతాల తండాలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్త సుగుణ కుటుంబానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. సుగుణ ఇద్దరు పిల్లలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి  మంగళవారం కేటీఆర్ వద్ద తీసుకొచ్చి వారి సమస్యలను వివరించారు. కేటీఆర్ స్పం దిస్తూ .. పిల్లలిద్దరి చదువు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. హత్యకు గురైన సుగుణ అదే తండాలో వార్డు సభ్యురాలిగా, బీఆర్‌ఎస్ క్రియాశీల కార్యకర్తగా సేవలందిచారని తెలిపారు. సుగుణ కుటుంబానికి పార్టీ తరఫున రూ. 5లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. సుగుణ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్ధికసాయం అందించటంతో పాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.