21-02-2025 01:04:18 AM
ఢిల్లీలో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దాదా పు 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ అధిష్టించింది. నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ, అనేక మంది ఎన్డీ యే పెద్దల సమక్షంలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆమె చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. రేఖా గుప్తా ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి కావడం గమనార్హం. ఢిల్లీలోని రామ్‌లీల మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
30 వేల మందికి పైగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు ‘జైశ్రీరాం’ అని నినదించడంతో రామ్ లీలా మైదానం మార్మోగిపోయింది. కొత్త సీఎం రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విజేందర్ గుప్తా అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు.
ప్రస్తుతానికి రెవెన్యూ శాఖ రేఖా గుప్తా వద్దే ఉండ గా.. డిప్యూటీ సీఎం పర్వేశ్ వర్మ వద్ద విద్య, పీడబ్ల్యుడీ, రవాణా వంటి శాఖలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హర్యానా ముఖ్యమంత్రి నాయ బ్ సింగ్ సైనీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్డీయే పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. గురువారం నూతన క్యాబినేట్ భేటీ అయి పలు నిర్ణయాలు ప్రకటించింది.
ఎవరీ రేఖా గుప్తా?
ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడు తోంది. అయినా బీజేపీ అధిష్ఠానం ఆమెను సీఎంగా నియమించడం గమనార్హం. ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన రేఖ అంచెలం చెలుగా ఎదిగారు. ఇప్పటికే మూడుసార్లు కౌన్సిలర్‌గా అలాగే ఓసారి సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా పనిచేశారు.
2022లో ఢిల్లీ మేయర్ పదవికోసం బీజేపీ తరఫున రేఖా గుప్తా, ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికలో రేఖా గుప్తా ఓడిపోయినా ఆమె ప్రభావం పెరిగిపోయింది. రేఖా గుప్తా బినోయ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమెకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కూడా ఉంది.
ఢిల్లీ నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా రికార్డులకెక్కారు. ఢిల్లీకి ఇప్పటిదాక ముగ్గురు మహిళా ముఖ్యమంత్రులు షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, అతిశీ పనిచేశారు. రేఖా గుప్తా ఇప్పటికే పలు పదవులు చేపట్టారు. బీజేపీ మహిళా మోర్చాలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఢిల్లీ బీజేపీకి జనరల్ సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు.
పడి లేచిన కెరటం రేఖ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టిన రేఖా గుప్తాకు అభినందనలు. రేఖ విద్యా ర్థి దశ నుంచి గొప్ప నేతగా ఎదిగిన తీరు అమోఘం. ఇప్పటికే వివిధ హోదా ల్లో ఆమె తన మార్క్ చూపెట్టారు. సీఎంగా కూడా తన మార్కు చూపిస్తారని నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నా.
ప్రధాని నరేంద్ర మోదీ