calender_icon.png 13 January, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నా

30-12-2024 03:16:54 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఏ పార్టీలో అయినా.. జాతీయ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఆ పార్టీ ఓనర్లే అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వాఖ్యానించారు. ఆదివారం ఆయన సమక్షంలో నేరెడ్‌మెట్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, నాయకులు.. సాయి కిరణ్ రెడ్డి, ఆకారం సాయి తదితరులు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఈటల మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నాని అన్నారు