calender_icon.png 10 October, 2024 | 3:47 AM

‘నేను బీఆర్‌ఎస్ మండలి చైర్మన్‌ను కాదు’

10-10-2024 01:44:04 AM

  1. రేవంత్‌రెడ్డి సర్కార్ అద్భుతంగా పనిచేస్తోంది 
  2. తెలంగాణలో టీడీపీకి స్కోప్ లేదు 
  3. మండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీనే 
  4. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి):  తాను బీఆర్‌ఎస్ మండలి చైర్మన్ ను కాదని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి  అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తోందని, మూసీ సుందరీకరణకు టెం డర్లే పిలువనప్పుడు దోచుకోవడం అనేది ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ప్రశ్నించా రు.

బుధవారం మండలిలోని తన ఛాంబర్‌లో మీడియాతో గుత్తా చిట్‌చాట్ నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవాళ్లకు ఇళ్లు ఇచ్చిన తర్వాతనే మూసీ నుంచి ఖాళీ చేయించాలన్నారు. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడే లేవని తెలిపారు. తలసా ని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారని గుర్తు చేశారు.

పార్టీ ఫిరాయింపు ల విషయంలో కోర్టు నుంచి ఎలాంటి ఆదే శం వస్తుందో చూడాలని అన్నారు. రాష్ట్రం లో టీడీపీకి స్కోప్ లేదన్నారు.  ప్రభుత్వ అవకతవకలపై ప్రతిపక్షం స్పందించాలని, కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదన్నారు. మండలి చీఫ్ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్ సభ్యుడేనని ఆయ న చెప్పారు. 

 నా కుమారుడిపై వ్యతిరేకత లేదు.. 

తన కుమారుడు అమిత్‌రెడ్డికి కార్పోరేష న్ పదవి ఇవ్వడంపై నల్లగొండ జిల్లా కాంగ్రె స్ నేతలందరూ సానుకూలంగానే ఉన్నారని గుత్తా చెప్పారు. జిల్లా రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోనని, పిలిస్తే మాత్రం వెళతానని పేర్కొన్నారు.