* బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా
* మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఖమ్మం, డిసెంబర్ 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను సత్తుపలి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖండించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అసత్యవార్తలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దని సూచిం చారు. కేసీఆర్ పిలుపుమేరకు బీఆర్‌ఎస్‌లో చేరిన తాను.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. ఐదేళ్లు తాను చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని అన్నారు. తానెప్పు డూ పదవుల కోసం తాపత్రయపడలేదని.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల మధ్యే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.