28-02-2025 12:19:52 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాం తి): ‘నేను ఎమ్మెల్సీ రేసులో లేను.. సీటు కావాలని ఎవరిని అడగలేదు.. పార్టీ నాకిచ్చే ప్రాధాన్యతతో సంతృప్తిగా ఉన్నా. నా నియో జకవర్గ ప్రజలు నన్ను గెలిపించినా.. ఓడిం చినా లాభమే చేస్తున్నా’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురు వారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్సీ టికెట్ రేసు లో ఉన్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు.
30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న జెట్టి కుసుమకుమార్‌తో పాటు గాంధీభవన్‌లో పార్టీ శ్రేణులకు సేవలందిస్తున్న కుమార్ రావులకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ మేర కు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనా క్షినటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్య క్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కు మార్‌రెడ్డి, శ్రీధర్‌బాబులకు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కుసుమకుమార్ వర్కింగ్ ప్రెసి డెంట్‌గా పని చేశారని, అదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని, పొన్నం ప్రభాకర్‌గా మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు.