రాజకీయాల్లో యువతను ప్రోత్సహించడమే తన లక్ష్యం
సీనియర్ నాయకులైతే యువతరాన్ని ఆశీర్వదించాలి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
కామారెడ్డి (విజయక్రాంతి): తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదని యువతను ప్రోత్సహించడమే తన లక్ష్యమని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంలో నూతన ఓరవడిని సృష్టించేందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ ల ఎంపికలో ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభగల వారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను అప్పగించినట్లు తెలిపారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సౌజన్యను నియమించినట్లు తెలిపారు. కొంతమంది పార్టీ నుంచి బహిష్కృతమైన కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకుని గాంధీభవన్లో సమావేశం ఉందని చెప్పి కొంతమందిని తీసుకెళ్లి అక్కడ తనపై ఆరోపణలు చేసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.
40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన సీనియర్ నాయకులు కొత్త తరానికి ముందు తరానికి ప్రోత్సహించి వారిని ఆశీర్వదించాలని సూచించారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువతను ప్రోత్సహించడమే తన లక్ష్యమని అన్నారు. రాజకీయంగా ఎవరు కూడా తనను దెబ్బతీయాలని ప్రయత్నించిన తాను తన కోసం పనిచేయడం లేదని కాంగ్రెస్ పార్టీష్టతకు పనిచేస్తున్నాను అని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గంగారం కొడుకు అరవింద్ ను పార్టీ ఎన్నికల ముందే బహిష్కరించిందని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జిగా తాను ఉన్నానని తనకు సంబంధం లేకుండా పార్టీ పదవులను పొందిన ప్రయోజనం ఉండదని అన్నారు. యువతను రాజకీయాల్లో తీసుకురావాలని దానికి కట్టుబడి తాను పనిచేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పెద్దలు కొందరు పొందే తనకు చెప్పారని అనేకమైనటు వంటి సమస్యలు వస్తాయి అని తెలిసినప్పటికీ నేనేమైనా పర్వాలేదు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తులను యువతను ప్రోత్సహించడమే తన లక్ష్యమని అన్నారు.
కాంగ్రెస్ పెద్దలు హెచ్చరించినప్పటికీ తాను ముందుకు వచ్చి రాజకీయంలో కొత్త వరవడి తీసుకువచ్చి ముందు తరానికి రాజకీయంగా అవకాశం కల్పించాలని ఉద్దేశంతో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని సౌజన్య ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చానని తెలిపారు. కుటీల రాజకీయాలకు పాల్పడిన వారిని పార్టీలో ఉపేక్షించేది లేదన్నారు, తాటాకు చప్పులకు భయపడేది ఏం లేదన్నారు. సీనియర్ నాయకులకు గౌరవం ఇస్తాం తప్ప తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు నాయకులు నిన్న గాంధీభవన్ తీసుకెళ్ళి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్నార. ఎంతోమంది సీనియర్ నాయకులు ఏం చేశారో జుక్కల్ నియోజకవర్గం వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న తరుణంలో డబ్బులు లేకుండా ప్రతిభ ఉంటే రాజకీయంగా ఎదుగువచ్చని ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే జుక్కల్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ పాలకవర్గాలను ఎంపికలో ప్రతిభను గుర్తించి వారికి అవకాశం కల్పించాను అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గంగారం వెనుక ఉండి రాజకీయాలు చేస్తున్నారని మీ యొక్క వర్గ ప్రజలకు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక తప్పుడు రాజకీయాలకు పూనుకుంటున్నారని అన్నారు జుక్కల్ నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు సీనియర్లు అయినంత మాత్రాన నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తనను సంప్రదించకుండానే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాటిని నష్టం చేసే చర్యలకు పాల్పడ్డ వారిని పార్టీ ఉపేక్షించాదన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా న్యాయంగా పనిచేసే కార్యకర్తలకు ఎప్పటికీ తన ఆహారంలో గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో నూతన ఉరవడిని సృష్టించామన్నారు, గత 40 ఏళ్లుగా పార్టీలో పనిచేసి ఎవరు ఏం చేశారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, విట్టల్ రెడ్డి, పుల్కల్ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్, సాయిని అశోక్ ,సిద్ధప్ప పటేల్, హనుమంతరావు, భీమ్ పటేల్, హనుమంత్ రెడ్డి, నాగేశ్వరరావు, సుశిత్ కుమార్, విట్టల్ రావు, నాగనాథ్ పటేల్, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.