calender_icon.png 23 November, 2024 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాటాకు చప్పుళ్లకు భయపడను

23-11-2024 12:00:00 AM

  1. యువతను ప్రోత్సహించడమే లక్ష్యం
  2. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

కామారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గంలో నూతన ఒరవడిని సృష్టించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభగల వారికి పదవులు ఇచ్చామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాహూల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువతను ప్రోత్సహించడమే నా లక్ష్యమన్నారు. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సీనియర్ నాయకులు కొత్త తరాన్ని ప్రోత్సహించి, ఆశీర్వా దించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు హెచ్చరించినప్పటికీ తాను రాజకీయంలో కొత్త ఒరవడి తెచ్చేందుకు మద్నూర్ మా ర్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా సౌజన్యను ఎం పిక చేసినట్టు తెలిపారు.

కుటిల రాజకీయాలకు పాల్పడిన వారిని పార్టీలో ఉపేక్షించేది లేదన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని చెప్పారు. సీనియర్ నాయకులకు గౌరవం ఇస్తామని, తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు గాంధీభవన్‌లో తనపై ఆరోపణలు చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గంగారాం వెనుక ఉండి కుళ్లు రాజకీయాన్ని చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైన న్యాయంగా పనిచేసిన కార్యకర్తలకు ఎప్పటికీ తన హయాంలో గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, పుల్కల్ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్పల్లి గంగాధర్, సాయిని అశోక్, సిద్దప్ప పటేల్, హనంతరావు, హన్మంత్‌రెడ్డి, భీం పటేల్, నాగేశ్వర్‌రావు,సుశిత్‌కుమార్, విఠల్‌రావు, నాగనాథ్ పటేల్, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.