ఒకప్పుడు పూజా హెగ్డే ఉన్నారంటే సినిమా పక్కా హిట్ అని అంతా అనేవారు. ఆమెది గోల్డెన్ లెగ్ అంటూ కీర్తించేవారు. వాస్తవం కూడా అలాగే ఉండేది. అందుకే ఆమె క్షణం తీరిక లేకుండా.. భాషా భేదం లేకుండా పని చేసేవారు. షూటింగ్స్‌లో నిత్యం బిజీగా ఉండేవారు. అలాంటి పూజాకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. గోల్డెన్ లెగ్ అన్న నోళ్లే ఐరన్ లెగ్ అనడం ప్రారంభించాయి. సినిమాలు వరుస పరాజయం పాలవడంతో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు.
కొంతకాలం పాటు పూజాకు సినిమాలే లేవు. దీంతో అంతా ఆమె పనైపోయిందని అనుకున్నారు. కానీ మళ్లీ ఆమె ఇటీవలి కాలంలో వరుస సినిమాలు దక్కించుకున్నారు. సూర్య, విజయ్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే తాజాగా ఆమెను ఓ ఇంటర్వ్యూలో ఫ్లాప్‌ల సమయంలో ఏమైనా బాధపడ్డారా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలిపారు. “నా మార్కెట్ పడిపోయిం దంటూ వచ్చిన వార్తలు నన్నెప్పుడూ బాధించలేదు. విజయం, పరాజయం ప్రతి చోటా ఉంటాయి. వాటి గురించి నేనెప్పుడూ భయపడను. నా పాత్రకు నేను ఎంతవరకు న్యాయం చేశాను అనేదే ఆలోచిస్తా” అని పూజా హెగ్డే తెలిపారు.