03-03-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
కరీంనగర్ క్రైమ్, మార్చి 2 (విజయక్రాంతి) : శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ డిసిసి కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
మొదట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, డిసిసి మైనారిటీ సెల్ అధ్యక్షులు యం. డి.తాజ్ హాజరై శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ వారి కలలను నెరవేరుస్తూ వారి ఆలోచనలను ఆచరణ రూపకంగా అమలుపరుస్తూన్నారన్నారు.