calender_icon.png 26 October, 2024 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బిడ్డగా నటించడం నా అదృష్టం

24-10-2024 12:33:35 AM

సాఫ్ట్‌వేర్ సంబంధాలు, వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లగ్గం’. ఇందులో సాయి రోనక్, ప్రగ్యా నాగ్ర, రాజేంద్రప్రసాద్, సప్తగిరి, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దర్శకుడు రమేశ్ చెప్పాల తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా లగ్గం విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ.. “స్కిన్ షో చేస్తేనే సినిమా ఆడుతుంది అని భావించే రోజుల్లో.. ఎలాంటి స్కిన్ షో లేకుండా ఇంత మంచి సినిమా తీశారు. ‘లగ్గం’ లాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే మార్పు మొదలవుతుంది” అన్నారు..

దర్శకుడు రమేశ్ మాట్లాడుతూ.. “తెలంగా ణ నేపథ్యంలో బలమైన కథ చెప్పాలని, ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ‘లగ్గం’ చిత్రం అరటాకులో వడ్డించిన విందు భోజనంలా ఉంటుం ది” అన్నారు. “లగ్గం’ చిత్రంతో ఒక మంచి మెసేజ్‌ని అందంగా చెప్పాలనుకున్నాం” అని నిర్మాత వేణుగోపాల్‌రెడ్డి అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “లగ్గం’ ఒక తండ్రీకూతుళ్ల కథ. ‘నాది 47 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్. లగ్గం చిత్రంలో తెలంగాణ బిడ్డగా నటించడం నా అదృష్టం’ అన్నారు.  సప్తగిరి, నటి రోహిణి, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.