26-02-2025 12:10:46 AM
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచ యం అవుతున్నారు. ఫిబ్రవరి 28న ఈ సిని మా విడుదల కానుంది.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి తమ్మారెడ్డి భరద్వాజతో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యా రు. వీవీ వినాయక్, బ్రహ్మజీ, ప్రేమ్ రక్షిత్ వీడియో బైట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఈవెంట్‌లో హీరోయిన్ సాషా చెత్రి మాట్లాడుతూ.. “మహిళలపై ఇలాంటి సిని మా, నేను ప్రధాన పాత్రలో నటించడం అం తా డ్రీమ్‌లా ఉంది. చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం” అని తెలిపింది. హీరో మిమో చక్రవర్తి మాట్లాడుతూ... “ఈ సినిమాకు మెయిన్ హీరో మాధవ్ గారు. మా నాన్నగారిలా నేను కూ డా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది” అన్నా డు.
చిత్ర దర్శకుడు మాధవ్ మాట్లాడుతూ... “మహిళా సాధికారత నేపథ్యంలో ఈ సిని మా తీశాం. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళ మా అమ్మ. ఆడవాళ్లకు స్వేచ్ఛ ఇస్తే ఆకాశమే హద్దు అనే రీతిలో తమ ప్రతిభ చూపిస్తారు. వాళ్ళ గొప్పదనం చాటి చెప్పేలా జర్నలిజం నేపథ్యంలో సినిమా చేశాం. మిమో యాక్షన్ సీన్స్ ఇరగదీశారు.
సాషా కూడా బాగా చేశారు. తనికెళ్ళ భరణి గారు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో కంటతడి పెట్టించారు” అని చెప్పారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, మహే ష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషించారు.