* డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్, డిసెంబర్ 29: హెచ్ వీసాల పెంపుపై రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణులైన ఉద్యోగులు అమెరికాలో పనిచే సేందుకు దోహదపడే ప్రత్యేక వీసా కార్యక్రమానికి తాన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుం దని పేర్కొన్నారు.
హెచ్1 బీ వీసాలకు తాను అనుకూలమేనంటూ స్పష్టం చేశారు. అమెరికా బ్యూరోక్రసీలో మార్పుల కోసం ఏర్పా టు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి చీఫ్‌లుగా ట్రంప్ నియమించుకున్న ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి సైతం స్పందించారు. అమెరికా తక్కువ స్థాయి నైపుణ్యమున్న పట్టభద్రులను తయా రు చేస్తున్నందున వల్ల ఇతర దేశాల నుంచి నిపుణులను రప్పించేందుకు హెచ్ 1బీ వీసా ఉపయోగపడుతోందని అభిప్రాయపడ్డారు.
స్కిల్ ఎక్కడున్నా దాన్ని అందిపు చ్చుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ఈ విషయంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్కీ హేలీ మాటా ్లడుతూ.. తాను సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిప్పుడు నిరుద్యోగ రేటు 11 శాతం నుంచి 4 శాతానికి తగ్గిందని.. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.