calender_icon.png 25 October, 2024 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడారి దేశంలో అరిగోస పడుతున్నా..

08-08-2024 03:48:20 AM

  1. గల్ఫ్ ఏజెంట్ నన్ను మోసం చేసిండు..
  2. సార్లు.. నన్ను ఇంటికి తీసుకెళ్లండి..
  3. సెల్ఫీ వీడియో ద్వారా ముదోల్ వాసి వేడుకోలు
  4. రాష్ట్రప్రభుత్వం స్పందించాలని అభ్యర్థన 

నిర్మల్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ‘నాపేరు రాథోడ్ నాందేవ్. మాది నిర్మల్ జిల్లా మదోల్ మండలం. రువ్వి మాస్వగ్రామం. వీసా తీసుకుని 10 నెలల క్రితం కువైట్ వచ్చాను. అక్కడ నాకు ఇంటిపని దొరుకుతుందనుకుంటే అది జరగలేదు. నమ్మిన ఏజెంట్ మోసం చేశాడు. యజమాని ఏడారిలో ఒంటెల సంరక్షణ పని అప్పగించాడు. నన్ను కొడుతున్నాడు. ఇక్కడ అరిగోస పడుతున్నా. నేను బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నా. నన్ను ఆదుకునేందుకు ఎవరూ లేరు.

నా కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియక సెల్ఫీ వీడియో చేస్తున్నా. నా కుటుంబ సభ్యులు ఈ వీడియోను రాష్ట్రప్రభుత్వానికి చేర్చాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి నన్ను భారత్‌లోని తన స్వగ్రామానికి తీసుకువచ్చేలా చేయాలని వేడుకుంటున్నా..’ అని గల్ఫ్ బాధితుడు సెల్ఫీ వీడియోలో బోరుమన్నాడు. ఈ వీడియోను కుటుంబ సభ్యులు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు చేరవేశారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించాలని బాధితుడి కుటుంబ సభ్యులు  వేడుకుంటున్నారు.