30-03-2025 12:07:08 AM
‘ఛావా’తో మంచి విజయాన్ని అం దుకుంది రష్మిక మందన్న. ఇంకా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘కుబేర’ చిత్రంతోపాటు ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘థామా’ సినిమాల్లోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ. వీటికన్నా ముందు రష్మిక.. సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టిన ‘సికందర్’ రంజాన్ కానుకగా మార్చి 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వ హించిన కార్యక్రమంలో రష్మిక మాట్లాడింది. “నేను కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఎప్పు డూ సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ‘మీ ఎంపికలే మిమ్మల్ని నటుడి నుంచి స్టార్‌గా వేరుచేస్తాయి’ అనే మాటను నేనొక పుస్తకంలో చదివాను.
వివిధ చిత్ర పరిశ్రమల్లో పని చేయాలను కోవడం నా ఛాయిస్. నాకు ఎవరి నుంచీ సలహాలు, సూచనలు లేవు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ నా సొంత నిర్ణయాలే. కూర్గ్ నుంచి కన్నడ పరిశ్రమకు వచ్చా. తెలుగు, హిందీ, తమిళంలో చేశా. భవిష్యత్తులో మలయాళంలోనూ చేయాలనేది నా కోరిక. ఆ అవకాశం వస్తుందనైతే అనుకుంటున్నా. ఇలా అన్ని పరిశ్రమల్లో అవకాశాలు పొందే క్రమంలో అంతకుముందు వారెవరూ నాకు తెలియదు. నా జీవితం నాదే. నా ఈ నిర్ణయాల వల్ల రేపు ఏం జరిగినా అది పూర్తిగా నేనే బాధ్యురాలినవుతాను. ఇక పోటీ గురించి చెప్పాలంటే.. దాంతో నాకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకుంటూ వెళ్లడమే ఉత్తమం అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది.