calender_icon.png 2 January, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాస్‌కు వీరాభిమానిని..

31-12-2024 01:45:44 AM

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో నటిం చడం గురించి ఆమె మాట్లాడారు. “రాజాసాబ్‌తో తెలుగులోకి నేను ఎంట్రీ ఇస్తున్నా. ఇదొక హారర్, రొమాంటిక్, కామెడీ మూవీ. ఇలాంటి జానర్‌లో నేనెప్పుడూ నటించలేదు.

ఈ సినిమా షూటింగ్ కోసం నేను హైదరాబాద్‌లోనే ఎక్కువగా కాలం గడుపుతు న్నా. ముఖ్యంగా ప్రభాస్‌తో నటించడం చాలా సరదా గా ఉంటుంది. ‘బాహుబలి’ తర్వాత నేను ఆయనకు వీ రాభిమానిని అయ్యాను. ఆయనతో ఒక్కసారైనా కలిసి నటించాలని కలలుగన్నా. ‘సలార్’ చిత్రంలో అవకాశం వచ్చినా అనుకోని కారణాలతో నటించలేకపోయాను.

కొన్ని నెలల తర్వాత ‘రాజాసాబ్’ అవకాశం రావడంతో ఆశ్చర్యపోయాను. ప్రభాస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని రాసి పెట్టి ఉందనుకున్నా” అని మాళవిక తెలిపారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది.