హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం స్పందించారు. ఓడిపోతానని తనకు ముందే తెలుసన్నారు. ఎన్నికలకు 3 నెలల మందే సీటు మార్చాలని కేసీఆర్ ను కోరారని తెలిపారు. 40 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలుస్తోందని బిఆర్ఎస్ అధినేతకు చెప్పానని ఎర్రబెల్లి పేర్కొన్నారు. మరో 20 స్థానాల్లో మార్చాలని కెసిఆర్ కు ముందే చెప్పానన్నారు. తన స్థానంలో కూడా మార్చాలని కెసిఆర్ ను కోరినట్లు తెలిపారు. ప్రజల అభిప్రాయం తనకు తెలుసని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 30 వేల నుంచి 50 వేల మెజార్టీతో సుధీర్ కుమార్ గెలుస్తారన్న ఎర్రబెల్లి లోక్ సభ ఎన్నికల్లో రెండో స్థానం కోసం కాంగ్రెస్, బిజెపి పోటీపడుతోందన్నారు.