పట్టభద్రులు ఆదరించి గెలిపిస్తే ఉద్యోగ, నిరుద్యోగుల సమస్యలపైన మండలిలో గళం విప్పుతాను.
ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాను.
మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్
కరీంనగర్ (విజయక్రాంతి): సర్కస్ గ్రౌండ్ వాకర్స్ పూర్తి మద్దతును వారికి ఇవ్వడం జరిగింది. వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు తెలుపాలని వారు సర్కస్ గ్రౌండ్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్సీగా ఆశీర్వదించి గెలిపిస్తే పట్టభద్రులకు, నిరుద్యోగులకు అండగా ఉంటానని వారికి ఉన్న సమస్యలను పరిష్కారానికి మండలిలో ప్రశ్నించే గొంతుకగా పోరాడుతాను. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఉన్న పట్టభద్రులకు రూపాయికే హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తాను. గతంలో నాకు కరీంనగర్ మేయర్ గా అవకాశం ఇస్తే నగర ప్రజల కోసం మున్సిపల్ పరిధిలో ఉన్న పార్క్ రక్షించి పార్కులను అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్స్ ను ఎర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా నగరపాలక సంస్థ అంటే మురికి కాలువలు తియ్యడం, రోడ్స్ వేయడం, డ్రైనేజ్ లు తీయడమే కాదని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి నా పదవీ కాలం పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా నాకు ప్రజలు దీవించి మండలికి పంపిస్తే నిరుద్యోగుల, పట్టభద్రుల కోసం పనిచేస్తానని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాను. నేను విద్యార్థి సంఘం నాయకుడిగా, న్యాయవాదిగా, కార్పోరేటర్ గా, మేయర్ గా, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు ఏ అవకాశం వచ్చిన అది ప్రజలకోసమే పని చేశాను, నేను నిత్యం మీ కండ్లముందు కదలడేవాడిని, ఏ రాత్రి ఫోన్ చేసిన నాకు ఫోన్ ఎత్తే అలవాటు ఉంది నా సెల్ ఫోన్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి నా దృష్టికి తెచ్చే ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నం చేస్తాను అని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.