ఆదిలాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రముఖ కార్ల డీలర్ ప్రకాశ్ హ్యుందాయ్ ఆదిలాబాద్ జిల్లాలో నూతన షోరూంను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కాలేజీ ఎదురుగా సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక సదుపాయాలతో, సరికొత్త హంగులుతో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను గురువారం కంపెనీ ఏపీ, తెలంగాణ రాష్టాల రీజినల్ మేనేజర్ రామ్‌కుమార్, షోరూం ఎండీ నల్ల దినేశ్‌రెడ్డి, సీఈవో నల్ల ప్రతిహాస్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పట్టణ, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి సేల్స్, సరీస్, స్పేర్స్‌లో అత్యాధునిక సదుపాయాలతో షోరూంను అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. సదుపాయాలని ప్రజలు సదినియోగం చేసువాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌వో మేనేజర్ రోహిత్ కుమార్, టీఎస్ఎం స్నేహమయి, సరీస్ టీఎస్ఎం ప్రకాశ్ , షోరూం మేనేజర్ ఉమాకాంత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.