న్యూఢిల్లీ, డిసెంబర్ 5: తమ వాహనాల ధరల్ని జనవరి 1 నుంచి పెంచనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా గురువారం వెల్లడించింది. ముడి వ్యయాలు, రవాణా వ్యయాలు పెరగడం, కరెన్సీ మారకపు విలువ ప్రతికూలతల కారణంగా ఆయా మోడల్స్ ధరల్ని రూ.25,000 వరకూ 2025 జనవరి 1 నుంచి పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలిపారు.