calender_icon.png 18 November, 2024 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హైపర్ సోనిక్’ సక్సెస్

18-11-2024 01:33:56 AM

డీఆర్డీవో క్షిపణి ప్రయోగం విజయవంతం

ధ్రువీకరించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

రష్యా, చౌనా సరసన భారత్ 

న్యూఢిల్లీ, నవంబర్ 17: భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆదివా రం ఉదయం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ఒడిశాలోని అబ్దుల్‌కలాం ఐలాండ్ నుంచి పరీక్షించినట్లు చెప్పారు. ఈ చారిత్రక ఘట్టంతో భారత్ అత్యాధునిక క్షిపణులు కలిగిన దేశాల జాబితాలో చేరింద’ని పేర్కొన్నారు. ఈ క్షిపణి 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు.

క్షిపణి హైదరాబాద్‌లోని అబ్దుల్‌కలాం మిసై ల్ కాంప్లెక్స్‌లో తయారుకావడం విశేషం. రక్షణ నిపుణుల పర్యవేక్షణలో డీఆర్డీవో శాస్త్రవే త్తలు తయారీలో కీలకపాత్ర పోషించారు.

పనితీరు ఇలా..

హైపర్ సోనిక్ క్షిపణి శబ్ద వేగం కంటే ఐదు రెట్లు అంటే గంటకు 6,200 కి.మీ వేగంతో ప్రయాణించి టార్గెట్‌ను ఛేదించగలదు. ఆ వేగాన్ని శత్రు దేశాలకు చెందిన రాడార్లు, అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ సాంకేతిక పరికరాలు సైతం గుర్తించలేవు. క్షిపణి భూతలం నుంచి పైకి 30 కి.మీ మేర గగనతలంలో  ప్రయాణించగలదు.  అక్కడి నుంచి రాకెట్ ఇంజిన్ నుంచి విడిపోతుంది. గ్లుడ్ వెహికిల్ నిర్దేశించిన లక్ష్యం దిశగా ప్రయాణం సాగిస్తుంది.

సాధారణ క్షిపణులు బాలిస్టిక్ గమనంలో ప్రయాణిస్తుండడంతో వాటిని రాడార్లు గుర్తిస్తున్నాయి. కానీ, హైపర్ సోనిక్ క్షిపణులు గ్లుడ్ వెహికల్ సాంకేతికతో రూపొందడంతో రాడార్లు గుర్తించలేనంత వేగంతో వెళ్తాయి. ఇప్పటికీ హైపర్ సోనిక్ క్షిపణులను రష్యా, చైనా కలిగి ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇటీవల ప్రయోగాలు చేసి హైపర్ సోనిక్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.