జనగామ, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఐనవో లు మండలంలోని గరిమెళ్లపల్లిలో హైనా సంచారం ఆందోళన కలిగిస్తోం ది. రెండు రోజుల వ్యవధిలో హైనా రెండు లేగ దూడలను హతమార్చింది. దీంతో పరిసర ప్రాంతాల రైతులు భ యాందోళన చెందుతున్నారు. గరిమెళ్లపల్లిలో రెండు రోజుల క్రితం ఓ లేగ దూడ హైనా దాడిలో మృతిచెందింది.
మరుసటి రోజే మరో లేగ దూడ చనిపోవడంతో ఫారెస్టు అధికారులు రం గంలోకి దిగారు. దూడలను హైనానే చంపినట్లు నిర్ధారణకు వచ్చా రు. సంఘటన స్థలంలో సోమవారం హైనా అడుగుజాడలను గుర్తించారు. హైనా సంచారంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.