calender_icon.png 24 April, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకపై కొత్త లోగోతో హైడ్రా కార్యకలాపాలు

23-04-2025 08:19:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వం స్థలాలు, చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తూన్న హైడ్రా, ఇకపై కొత్త లోగోతో తన కార్యకలాపాలను నిర్వహించనుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRAA) కొత్త లోగోను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈవీడీఎం లోగోనే వినియోగించిన హైడ్రా హైదరాబాద్ నగరాన్ని సూచిస్తూ హెచ్(H) అక్షరంపై నీటి బొట్టు ఉన్న లోగోను రూపొందించింది. జల సంరక్షన చేపడుతూనే నగరాన్ని విపత్తుల నుంచి రక్షించుకుందామని సూచిస్తూ కొత్త లోగోను తీర్చిదిద్దారు. ఈ లోగోను అధికారికంగా ఆమోదించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇప్పటి నుంచి హైడ్రా కార్యాలయం, వాహనాలు, సిబ్బంది యూనిఫామ్స్ పై కొత్త లోగోతోనే కార్యకలాపాలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. అలాగే హైడ్రా అధికారిక ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ కు కూడా కొత్త లోగోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టారు.