హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA Jobs) నగరంలో 970 కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఆఫర్ చేయనుంది. TNIEలో ప్రచురితమైన నివేదిక ప్రకారం, ఏజెన్సీ 203 మంది మేనేజర్‌లు, 767 మంది సహాయకులను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు నియమించుకో నుంది. హైదరాబాద్‌లోని నీటి వనరుల కోసం హైడ్రా కాంట్రాక్ట్ ఉద్యోగాల(Hydra Contract Jobs)ను అందిస్తుంది.
ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) వరకు నీటి వనరులు, ఉద్యానవనాలు, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, నాలాలను రక్షించడంలో హైడ్రాకు సహాయం చేయడం రిక్రూట్‌ల బాధ్యత. అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించడం కూడా వారి బాధ్యతలలో ఉంటుంది. హైదరాబాద్‌లోని ఫుట్‌పాత్‌లు, సరస్సులు, ఖాళీ స్థలాలు, పార్కులు మొదలైన వాటిపై ఆక్రమణల తొలగింపు, హైడ్రా(HYDRAA) అందించే కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం వారి పాత్రలు బాధ్యతల క్రిందకు వస్తాయి. నివేదిక ప్రకారం, ఎంపికైన అభ్యర్థులు ఏడు ప్యాకేజీలుగా వర్గీకరించబడతారు: మేనేజర్లు రెండు, అసిస్టెంట్లకు ఐదు ప్యాకేజీలు ఉంటాయి. జీతాల కోసం ఏడాదికి రూ.31.70 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మేనేజర్లు నెలకు రూ.22,750 పొందే అవకాశం ఉండగా, సహాయకుడి నెల జీతం రూ.19,500. ఉంటుందని సమాచారం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని కమిషనర్ రంగనాథ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.