calender_icon.png 4 October, 2024 | 6:57 PM

హెచ్‌ఎండీఏ వరకూ హైడ్రా

05-09-2024 12:48:00 AM

  1. త్వరలో ప్రభుత్వం జీవో విడుదల?  
  2. ఇప్పటికే ఓఆర్‌ఆర్ పరిధిలో సేవలు 
  3. ఇక ముందు మొత్తం ఏడు జిల్లాలకు విస్తరణ 
  4. వ్యవస్థ పరిధిలోకి మొత్తం 2,500 చెరువులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల ను ఆక్రమించిన కబ్జాదారులపై కొర డా ఝులిపిస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు పనిచేస్తున్న హైదరాబాద్ డిజిస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు సేవలందిస్తున్నది. ఇకపై హెచ్‌ఎండీఏ వరకు విస్తరించనున్న ది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు త్వరలోనే జీవో విడుదల చేయనున్నట్లు విశ్వాసనీయ సమాచార ం. జీవో నంబర్ 99 ప్రకారం ఓఆర్‌ఆర్ వరకే పరిమితం. ఇప్పటికే హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది.

దీంతో హైడ్రాకు తమ ప్రాంతాలకూ పలు జిల్లాల నుంచి ప్రజల డిమాండ్ మొదలైంది. జీవో ప్రకారం నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడం పై ఇప్పటికే కట్టడాలు నిర్మించిన వారు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే చట్టం రూపొందించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది. ఇదే క్రమంలో ప్ర స్తుతం ఏడు జిల్లాల పరిధిలో కొనసాగుతు న్న హెచ్‌ఎండీఏ పరిధిలోకి హైడ్రాను విస్తరి ంచనున్నట్టుగా తెలుస్తుంది.

దీంతో హైదరాబాద్ చుట్టూరా మొత్తం 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విస్తరించనున్నది. మరోవైపు కూల్చివేతలు విపక్ష పార్టీలకు చెందిన వారిపై కక్షసాధింపు చర్యలనే విమర్శలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేటీ ఆర్ నివసిం చే జన్వాడ ఫాంహౌస్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కళాశాలలు కూల్చివేస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. 

ఇప్పటికే కసరత్తు షురూ..

ప్రస్తుతం హెచ్‌ఎండీఏ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ యాదాద్రిెొవన గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జి ల్లాల పరిధిలో కొనసాగుతుంది. హైడ్రా ప్ర ధాన లక్ష్యం చెరువుల పరిరక్షణ, చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ఆక్రమణల నుంచి చెరువులు, కుంటలను రక్షిం చడం. ఇకపై కబ్జాలకు ఆస్కారం లేకుండా చేయడం. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్నట్లుగానే ఓఆర్‌ఆర్ పరిధిలో కేవలం 920 చెరువులు మాత్రమే ఉన్నట్లుగా ఇటీవల రిమోట్ సెన్సార్ ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ప్రస్తుతం హైడ్రాను హెచ్‌ఎండీఏ దాకా విస్తరిస్తే ఏడు జిల్లాల పరిధిలో 2,569 చెరువులను ప్రత్యక్షంగా సంరక్షించే పనిని హైడ్రా చేపట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఓఆర్‌ఆర్ దాటి చేపడుతున్న హైడ్రా చర్యలను సైతం విపక్షాలు తప్పుబట్టడానికి ఆస్కారం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో హైడ్రా పరిధిని హెచ్‌ఎండీఏ దాకా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.