calender_icon.png 29 September, 2024 | 9:07 AM

ఢిల్లీకి మూటలు మోసేందుకే ‘హైడ్రా’

28-09-2024 01:34:35 AM

కూల్చివేతల పేరుతో ప్రభుత్వం అక్రమ వసూళ్లు

హైడ్రా వల్ల హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకం

బీజేపీ ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కూల్చివేతల పేరుతో అక్రమ వసూ ళ్లకు పాల్పడి ఢిల్లీకి మూటలు పంపేందుకే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. హైడ్రా పెద్దలను వదిలి, కేవలం పేదలపైనే ప్రతాపం చూపిస్తోందని దుయ్యబట్టారు.

శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురిచేసి, వసూ లు చేసిన మూటలను ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సర్దుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు తెలంగాణ, కర్ణాటక నుంచే నిధులు వెళ్తున్నాయన్నారు. హైడ్రా పేరు చెబితేనే హైదరాబాద్ ప్రజలు హడలిపోతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ అనుకూల బడా వ్యాపారుల అక్రమ స్థలాలపై హైడ్రా ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రె స్ చేస్తున్న దోపిడీని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. పాలన చేతగాక అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు, హైడ్రా వంటి అంశాలతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందన్నారు. హైడ్రాను జిల్లాలకూ విస్తరిస్తున్నారని,దీనికో ప్రాతిపదిక ఉండదా అని ప్రశ్నించారు. 

నేడు వక్ఫ్ జేపీసీ హైదరాబాద్ రాక..

వక్ఫ్ బోర్డ్ సవరణల బిల్లుపై ఏర్పాటైన జేపీసీ బృందం శనివారం హైదరాబాద్‌కు రానున్నట్లు డీకే అరుణ తెలిపారు. తాజ్ కృష్ణా హోటల్‌లో జేపీసీని కలిసి వక్ఫ్ బాధితులు, ముస్లిం పెద్దలు తమ అభ్యంత రాలను విన్నవించవచ్చని వెల్లడించారు. ముస్లింలకు న్యాయం చేయడం కోసమే వక్ఫ్ బోర్డుకు కేంద్రం సవరణలు చేపట్టేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు.