calender_icon.png 27 November, 2024 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమీన్‌పూర్‌లో ఆక్రమణలపై హైడ్రా సర్వే

06-11-2024 01:35:06 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): అమీన్‌పూర్‌లోని రహదా రులు, పార్కులు కబ్జాకు గురైనట్టుగా స్థాని కులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికా రులు సర్వే విభాగం అధికారులతో కలిసి మంగళవారం సర్వే చేశారు. స్థానిక వెంక టరమణ కాలనీలోని గోల్డెన్ కీ వెంచర్‌కు చెందిన వారు ఎకరానికి పైగా ఉన్న పార్కు స్థలంతో పాటు రహదారులను కబ్జా చేశా రంటూ ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

మొత్తం 5 సర్వే నంబర్లలోని 150 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని  గోల్డెన్ కీ వెంచర్ సిబ్బంది సమక్షంలో అధికారులు సర్వే చేశారు. ఈ సందర్భంగా సర్వే నంబర్ల ఆధారంగా లేఅవుట్లను పరిశీలించి పార్కు స్థలాలతో పాటు రహదారులను కాపాడేందుకు అధి కారులు చర్యలు చేపట్టారు. కాగా, ఇరు పక్షాలు ఈ విషయంపై హైకోర్టును ఆశ్ర యించగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వే చేపట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.