calender_icon.png 22 April, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంట్లూరు పెద్దచెరువు కబ్జా

11-12-2024 12:49:07 AM

అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 10: నగర శివారులో కబ్జాలపై హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూ రు గ్రామ పరిధిలోని కుంట్లూరు పెద్దచెరువు కబ్జాకు గురైందనే హైడ్రాకు అందిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం హైడ్రా తహసీల్దార్ హేమామాలిని, రెవెన్యూ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈ వంశీగౌడ్ ఆధ్వర్యంలో చెరువుకు సంబంధించి సర్వే ప్రారంభించారు.

సర్వే జరుగుతున్న సమయంలో అధికారులను స్థానికులు కొందరు అడ్డుకున్నారు. ఓ ప్రైవేట్ సర్వేయర్ హైడ్రా అధికారులతో కలిసి సర్వే చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. బుధవారం చెరువు వద్దకు కమిషనర్ రంగానాథ్ వచ్చి పరిశీలించనున్నారు. హైడ్రా ఇన్స్‌స్పెక్టర్ ఆదిత్య, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వేలో పాల్గొన్నారు.