calender_icon.png 30 April, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజేంద్రనగర్‌లో హైడ్రా సిబ్బంది పర్యటన

30-04-2025 12:00:00 AM

తమ భూమిని ఆక్రమించారని అగ్రికల్చర్ 

 యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు 

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 29: అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన కొంత భూమిని పక్కనే ఉన్న ఓ నిర్మాణ సంస్థ ఆక్రమించిందని హైడ్రాకు అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. అయితే ఇంతకుముందే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పరిశీలించి ఓసారి సర్వే నిర్వహించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు హైడ్రా సిబ్బంది యూనివర్సిటీ కి సంబంధించిన సరిహద్దు పాయింట్లు క్షుణ్ణంగా పరిశీలించింది. అగ్రికల్చర్ వర్సిటీ అధికారులతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.