calender_icon.png 17 March, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రహరీని తొలగించిన హైడ్రా

17-03-2025 10:45:55 AM

రాజేంద్రనగర్: బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ(Bandlaguda Jagir Municipal Corporation) పరిధిలో శ్రీనివాస ఎంక్లేవ్, శ్రీ హర్షిత కాలనీల మధ్య ఉన్న ప్రహరీ గోడను తొలగించేందుకు బిజిఎంసి కమిషనర్ బి. శరత్ చంద్ర కొన్ని రోజుల క్రితం  హైడ్రా అధికారులకు లేఖ రాశారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం  రెండు కాలనీ ల మధ్య ఇంటర్నల్ కనెక్టివిటీ కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు, హైడ్రా అధికారుల(HYDRA officials) సమక్షంలో ప్రహరీ గోడను తొలగించారు. ఈ నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్ , డిప్యూటీ ఈఈ యాదయ్య, ఏ ఈ ఈ రాజ్ కుమార్ గారు, టౌన్ ప్లానింగ్ అధికారి వాణి, శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్, మునిసిపల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.