22-01-2025 12:53:14 AM
ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21(విజయక్రాంతి): హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. బుద్ధ భవన్ పక్కనే ఏర్పాటు చేయబోయే ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు.
లోపల గదులు, క్యాబిన్లను నిర్మించాలని, ఫిర్యాదుదారులకు వసతులు కల్పించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూడాలని సూచించారు.