calender_icon.png 27 November, 2024 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా పనితీరు అద్భుతం

27-08-2024 01:30:58 AM

మంచిపనే కాబట్టి వేరే పార్టీలో ఉన్నా సమర్థిస్తున్న

నా సర్వేలో 78శాతం మంది మద్దతు పలికారు

ఎండోమెంట్ భూములను కూడా రక్షించాలె

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజేంద్రనగర్, ఆగస్టు26: హైడ్రా అద్భుతంగా పనిచేస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కితాబు ఇచ్చారు. చెరువులు, కుంటలు, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ ప్రాంతా ల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా అద్భుతంగా పనిచేస్తున్నట్లు ప్రశంసించారు. హైడ్రా పనితీరుపై తాను నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది బాగుందన్నారని, మిగతా 22 శాతం వ్యతిరేకించినట్లు ఎంపీ వివరించారు. సోమవారం ఆయన శంషాబాద్‌లోని బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వద్ద నిర్మిస్తున్న ఫ్లుఓవర్‌ను పరిశీలించారు.

అధికారులతో మాట్లాడి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైడ్రా ఏర్పాటుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. హైడ్రా ఏర్పాటు ఎంతో మంచి నిర్ణయమన్నారు. ఇది కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదన్నారు. ఒకవేళ కక్షసాధింపులకు దిగితే మొదట జన్వాడలోని కేటీఆర్ ఫాంహౌస్‌నే కూలగొట్టేవారు కదా అని ఆయన ప్రశ్నించారు. హైడ్రా అధికారులు పార్టీలకు అతీతంగా కూల్చివేతలు చేపడుతున్నారన్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిని నిర్మాణాన్ని కూల్చివేశారని గుర్తుచేశారు. 

 సినిమా స్టార్ల నిర్మాణాలు కూడా.. 

ధనికులు, సామాన్యులు అనే తేడా లేకుం డా సినిమా స్టార్ల అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చివేశారని ఆయన అన్నారు. హైడ్రా పర్యావరణ సంరక్షణకు చర్యలు తీసుకుంటోందని అభినంది ంచారు. జన్వాడలోని కేటీఆర్ ఫాంహౌస్ ఎవరిదో అందరికి తెలుసన్నారు. కేటీఆర్ ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో లేదని, 111 జీవో పరిధిలో ఉందని స్పష్టం చేశారు. హైడ్రా అలాగే కొనసాగాలని ఆయన సూచించారు.

 మూడు ప్రతిపాదనలు

 సందర్భంగా హైడ్రాకు మూడు ప్రతిపాదనలు చేశారు. అక్రమ నిర్మాణాల నింది తులను గుర్తించాలన్నారు. స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించి నిర్మాణాలను చేపట్టిన బిల్డర్లను సైతం శిక్షించి సదరు నిర్మాణాల వ్యర్థాల తొలగింపునకు అయ్యే ఖర్చును వారి నుంచే వసూలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితుల్లో చాలామంది సామాన్యులు, నిరుపేదలు ఉండటం తో వారికి న్యాయం జరిగేలా పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన సదరు అధికారులపైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండోమెంట్ భూ ములను ఆక్రమించుకున్నవారిపైనా హైడ్రా ఇదేవిధంగా చర్యలు తీసుకొని భూములను పరిరక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు.