ఘట్కేసర్,(విజయక్రాంతి): మీరాలం కుంట ఎఫ్టీఎల్ స్థలం కబ్జాకు గురైందనే ఆరోపణలతో స్పందించిన హైడ్రా అధికారులు అన్నోజిగూడ లోని మీర్కాన్ కుంటను శుక్రవారం సందర్శించి పరిశీలించారు. దింతో పోచారం మున్సిపాలిటీ ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని మీరాలం కుంట స్థలాన్ని బతుకమ్మ ఘాట్ నిర్మాణం పేరుతో 2 వేల గజాల స్థలం పూడ్చి వేయటంతో పాటు ఎఫ్టీఎల్ స్థలం కబ్జాకు గురైందని స్థానిక కౌన్సిలర్ బాలగోని వెంకటేశ్ గౌడ్ ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు మీరాలం కుంటను సందర్శించి పరిశీలించారు. కబ్జాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వెంకటేశ్ గౌడ్ కోరారు. మీరాలం కుంట భూముల కబ్జాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు.