calender_icon.png 14 March, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివగంగ కాలనీలో హైడ్రా అధికారుల పర్యటన

14-03-2025 12:59:03 AM

  పార్కు స్థలం కబ్జా చేసినట్లు స్థానికుల ఫిర్యాదు

ఎల్బీనగర్ , మార్చి 13 : మన్సూరాబాద్ డివిజన్ లోని శివగంగ కాలనీలో పార్కు స్థలం కబ్జా చేసినట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం శివగంగ కాలనీలో హైడ్రా అధికారులు పర్యటించినట్లు కాలనీ అధ్యక్షుడు  తొంట బాబు తెలిపారు.

శివం హిల్స్ కాలనీకి చెందిన చంద్రారెడ్డి స్థానికంగా సుమారు 153 గజాల స్థలాన్ని కబ్జా చేసినట్లు హైడ్రా అధికారికి కాలనీవాసులు వివరించారు. ఈ క్రమంలో చంద్రారెడ్డిని హైడ్రా అధికారులు విచారించగా, తానే స్థలాన్ని కబ్జా చేసినట్లు చంద్రారెడ్డి ఒప్పుకున్నాడు.

ఇదే స్థలాన్ని కబ్జా చేసినట్లు గతంలో జోనల్ కమిషనర్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు వాపోయారు. శివగంగ కాలనీ పేరు చెప్పుకొని లెటర్ ప్యాడ్లు తయారు చేయించి, కాలనీల్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని కాలనీవాసులు చంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు. కార్యక్రమంలో శివగంగ కాలనీ సంఘం ఉపాధ్యక్షుడు నకిరేకంటి వెంకటేశ్ గౌడ్, సెక్రెటరీ సతీశ్ రెడ్డి, దుర్గం నర్సింహ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.