calender_icon.png 20 March, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంట్లూరులో హైడ్రా అధికారుల పర్యటన

20-03-2025 12:00:00 AM

  • కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలి: చామ వియజశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి

సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం : హైడ్రా, రెవెన్యూ అధికారులు

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 19 : రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ కుంట్లూరులో హైడ్రా అధికారులు పర్యటించారు. కుంట్లూ రు గ్రామ రెవెన్యూ సర్వే 24లో సుమారు రూ. 100 కోట్ల విలువ చేసే 2 ఎకరాల  ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని హైడ్రా అధికారులకు ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చామ విజయశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేశారు.

దీంతో హైడ్రా, రెవెన్యూ అధికారులు పర్యటించి సర్వే నిర్వహిం చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చామ విజయశేఖర్‌రెడ్డి, కృష్ణా రెడ్డిలు మాట్లాడుతూ... కుంట్లూరు గ్రామంలో సుమారు 100కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కళ్లెం వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపించారు.

కోట్లాది రూపా యలు విలువ చేసే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తెలిపారు. హైడ్రా, రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. కుంట్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 24 సంబంధించిన ప్రభుత్వ భూమిని పూర్తి స్థాయి లో సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.